‘బైకర్’ సినిమా నుండి ఈరోజు విడుదలైన ‘బుల్లెట్ సునీల్’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.60 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సీనియర్ హీరో రాజశేఖర్ గెటప్ మరియు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్ ప్రకారం, రాజశేఖర్ ఈ చిత్రంలో ఒక రిటైర్డ్ రేసింగ్ ఛాంపియన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో హీరో శర్వానంద్‌ను రేసింగ్ ప్రపంచంలోకి నడిపించే వ్యక్తిగా ఆయన పాత్ర ఉండబోతోందని తెలుస్తోంది. గిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కు వెన్నెముకలా నిలిచింది.
యూవీ క్రియేషన్స్ మేకింగ్ వాల్యూస్ సినిమాను హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో చూపిస్తున్నాయి. రాజశేఖర్ మరియు శర్వానంద్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సీన్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ ‘రీ-స్టార్ట్’ గ్లింప్స్ తో సినిమా ప్రమోషన్స్ ను సాలిడ్ గా స్టార్ట్ చేశారు . ఏప్రిల్ 3న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో వచ్చి బ్లాక్ బస్టర్ విజయంతో సూపర్ ఫామ్ లోకి వచ్చాడు శర్వానంద్. మరి ఈ బైకర్ తో తన ఫామ్ కంటిన్యూ చేస్తాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























