స్ట్రీమింగ్ లోకి నారీ నారీ నడుమ మురారి

Nari Nari Naduma Murari Now Streaming on prime video

శర్వానంద్ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ డిజిటల్ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రం ఈరోజే (ఫిబ్రవరి 4, 2026) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.

‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు.పెళ్లి సంబంధం చుట్టూ తిరిగే గందరగోళం, గతానికి సంబంధించిన ఒక రహస్యం నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ కామెడీలో వెన్నెల కిశోర్, సత్య మరియు నరేష్‌ల కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది.సంక్రాంతి రేసులో భారీ సినిమాల మధ్య పోటీపడి సుమారు 35 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి శర్వానంద్‌కు మంచి విజయాన్ని అందించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.