తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వర్క్ చేయాలని ఉండేది – ఇషా రెబ్బా

I Always Wanted to Work Under Tarun Bhascker’s Direction says Eesha Rebba

మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటించిన హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించారు. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్ లో ఇషా రెబ్బా మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. ‘ఈ నగరానికి’ బాయ్స్ అందరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సృజన్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. తను ఎప్పుడు కూడా కొత్త కంటెంట్ ని ప్రోత్సహిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్. నన్ను ఈ క్యారెక్టర్ లో బిలీవ్ చేసినందుకు సజీవ్ కి థాంక్యూ. సజీవ్ ఈ సినిమాని డిజైన్ అద్భుతంగా చేశారు. నందు చాలా చక్కని డైలాగ్స్ రాశారు. ప్రతి క్యారెక్టర్ రిలేట్ అయ్యేలా ఉంటుంది.

ఇందులో చాలా మీనింగ్ ఫుల్ మ్యూజిక్ మ్యూజిక్ వుంటుంది.తరుణ్ గారి డైరెక్షన్ లో వర్క్ చేయాలని ఉండేది. ఆయన యాక్టింగ్ కూడా చక్కగా చేస్తారని తెలుసు. కానీ ఆయనకి గోదావరి యాస రావడం చాలా చాలా కష్టం.దాని కోసం చాలా ప్రిపేర్ అయ్యారు. అంబటి ఓంకార్ నాయుడు పాత్రకి ప్రాణం పోశారు. ఆయనతో వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది.ఆయన డైరెక్షన్లో కూడా పని చేస్తాననే నమ్మకం ఉంది. ఇందులో నా క్యారెక్టర్ తో ప్రతి అమ్మాయి రిలేట్ అవుతుంది. ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ సినిమా పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. జనవరి 30న తప్పకుండా అందరూ థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.