పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ముగియడంతో తాజాగా చిత్రబృందం డబ్బింగ్ పనులను ప్రారంభించింది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా, త్వరలోనే పవన్ కళ్యాణ్ తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేయనున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్ గా ఈసినిమానుండి విడుదలైన మొదటి పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలోనే రెండో పాటను రిలీజ్ చేయనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల , రాశి ఖన్నా కథానాయికలుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఈ సినిమా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులకు అందించాలని చూస్తున్నారు. కుదిరితే మార్చి చివర్లో కానీ లేదా ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























