నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం 5 రోజుల్లోనే ఈ ఘనతను సాధించి నవీన్ పొలిశెట్టి కెరీర్లో బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. పక్కా కామెడీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి సెలవులు ఈ చిత్రానికి భారీగా కలిసివచ్చాయి. మొదటి రెండు రోజుల్లోనే రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం, ఆ తర్వాత కూడా అదే వేగాన్ని కొనసాగించి 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మార్కును అధిగమించింది.ఇప్పటికే ఈసినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.
ఈసినిమాలో నవీన్ పొలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగా, మారి దర్శకత్వం మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో వసూళ్ల వర్షం కురిసింది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసింది. ‘జాతి రత్నాలు’ తర్వాత నవీన్ పొలిశెట్టికి ఇది వరుసగా రెండో 100 కోట్ల చిత్రం కావడం విశేషం.ఇక ఈసినిమాతో నిర్మాత నాగవంశీ కూడా కం బ్యాక్ ఇచ్చాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























