‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా భారీ విజయాన్ని విమర్శకుల ప్రశసంలు అలాగే అవార్డులు అందుకున్న వేణు యెల్దండి తన తదుపరి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఆయన పంచుకున్నారు.ఈ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను జనవరి 15న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు వేణు వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ బ్యానర్ లో 61వ సినిమాగా వస్తుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ నటించనున్నారని, నటుడిగా ఆయనకు ఇది మొదటి సినిమా కాబోతోందని ప్రచారం జరుగుతుంది. ‘బలగం’ లాగే ఈ సినిమా కూడా తెలంగాణ మట్టి వాసన, గ్రామీణ సంస్కృతి నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథతో రాబోతోంది.
“బలగం నాకు ప్రేమ మార్గాన్ని చూపింది.. మళ్ళీ అదే దారిలో మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను” అంటూ వేణు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అప్‌డేట్ ఇచ్చారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























