పుష్ప 2 కోసం జపాన్ లో అల్లు అర్జున్

Allu Arjun in Japan for Pushpa 2 Promotions

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, భారత సినీ పరిశ్రమను షేక్‌ చేసిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఇప్పుడీ చిత్రం జపాన్‌లో సంద‌డి చేయ‌నుంది. విడుదలైన రోజు నుంచే ఓ సెన్సేష‌న‌ల్‌గా మారిన ఈ సినిమా ఇండియ‌న్ సినీ బాక్సాపీస్ ద‌గ్గ‌ర తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాలో జ‌పాన్‌కు సంబంధించి ఓ స్పెష‌ల్ రెఫ‌రెన్స్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. పుష్ప ఎంట్రీ ఫైట్ సీన్ జ‌పాన్ నేప‌థ్యంలో సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్ స్వ‌యంగా జ‌ప‌నీస్‌లో డైలాగ్స్ చెప్ప‌టం ప్రేక్ష‌కులను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ ఎలిమెంట్స్ ఇప్పుడు జ‌పాన్ ప్రేక్ష‌కుల్లో పుష్ప 2పై మ‌రింత ఆస‌క్తిని పెంచ‌నున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుప్ప 2 సినిమాను జ‌పాన్‌లో ‘పుష్ప కున్రిన్’గా జనవరి 16న విడుదలవుతోన్న సందర్భంగా అల్లు అర్జున్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి టోక్యో చేరుకున్నారు. త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అంద‌మైన న‌గ‌రం ఉన్న ఫొటోను తీసి పోస్ట్ చేశారు.దీనికి సింపుల్‌గా టోక్యో అనే క్యాప్ష‌న్ పెట్టారు.

గీక్ పిక్చ‌ర్స్‌, షోచికు సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి పుష్ప మ్యాడ్‌నెస్‌ను జ‌పాన్ సిల్వ‌ర్ స్క్రీన్స్ మీద‌కు తీసుకు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే జ‌పాన్ ప్రేక్ష‌కుల‌కు ఇండియ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ చూపారు. ఈ నేప‌థ్యంలో పుష్ప కున్రిన్ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని నిర్మాత‌లు న‌మ్మ‌కంగా ఉన్నారు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించి రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం పుష్ప 2 మూవీ జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ అనే పేరుతో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం జనవరి 15, 2026న జపాన్‌ థియేటర్లలో ప్రీమియర్స్‌గా ప్ర‌ద‌ర్శితం కానుంది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌. ఇందులో ఫహాద్‌ ఫాజిల్‌ పోలీస్‌ అధికారిగా కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.