యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుండగా ఈ చిత్రానికి సాధారణ టికెట్ ధరలే వర్తించనున్నాయి. పండగ సీజన్‌లో పెద్ద సినిమాల కోసం ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చినప్పటికీ, ఈ సినిమా మేకర్స్ మాత్రం ప్రేక్షకులకు తక్కువ ధరకే వినోదాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ మరియు మల్టీప్లెక్స్‌లలో సాధారణ రేట్లతోనే ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ బోర్డు నుండి యు/ఏ’ సర్టిఫికేట్ లభించింది.సినిమా నిడివి సుమారు 150 నిమిషాలు గా ఉండనుండి. ఈ సినిమా జనవరి 14 సాయంత్రం 5:49 గంటలనుండి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సంయుక్త మీనన్ మరియు సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీ పడుతున్న ఈ చిత్రానికి సాధారణ టికెట్ ధరలు ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒక సానుకూల అంశంగా మారనుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























