తమిళ హీరో శివ కార్తికేయన్ మరియు శ్రీలీల జంటగా నటించిన ‘పరాశక్తి’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమాకు మిక్సెడ్ రివ్యూస్ వచ్చినా మొదటి రెండు రోజులు బాగానే వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా రెండవ రోజు 24 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి రెండు రోజుల్లో 51 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. సోలో గా రిలీజ్ కావడం పరాశక్తి కి అడ్వాంటేజ్ అయ్యింది. మరి ఫుల్ రన్ లో ఏ మేరకు వసూళ్లను అందుకుంటుందో చూడాలి.
సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేయగా అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించాడు. జయం రవి ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ఆకాష్ భాస్కరన్ నిర్మించారు. విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈసినిమా రిలీజ్ తరువాత మాత్రం సరైన టాక్ తెచ్చుకోలేకపోయింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























