భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రిలీజ్ 

Official Trailer of Bhartha Mahasayulaku Wignyapthi Released

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను మరింత పెంచుతూ, మేకర్స్ నేడు ట్రైలర్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ట్రైలర్ లో సినిమా స్టోరీని కూడా రివీల్ చేశారు.ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే హీరోగా రవితేజ సినిమాలో కామెడీ పంచనున్నాడు. ట్రైలర్ అయితే  హిలేరియస్ అనిపించింది. రవితేజ తన మార్క్ కామెడీ టైమింగ్ మరియు మేనరిజమ్స్‌తో అదరగొట్టారు.

రవితేజ సరసన హీరోయిన్లుగా ఆషికా రంగనాథ్ ,డింపుల్ హయతి  నటించారు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ మరియు కామెడీ సీక్వెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది ఒక పక్కా ఫ్యామిలీ డ్రామా అని, కిషోర్ తిరుమల తన గత చిత్రాలైన ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ తరహాలోనే ఎమోషన్స్ మరియు ఫన్ సమపాళ్లలో కలిపి తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సో ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ ఉండడం అలాగే ఇప్పటికే సాంగ్స్ సూపర్ హిట్ కావడం ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కూడా హిలేరియస్ గా ఉండడంతో రవితేజకు ఈసారి హిట్ కన్ ఫర్మ్ అయ్యినట్లే.  

 ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.