నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిసెంబర్ 12, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.
నెట్‌ఫ్లిక్స్ ఈసినిమాను జనవరి 9, 2026 తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంచనుంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ‘సరైనోడు’ ఫేమ్ ఆది పినిశెట్టి అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో మెప్పించారు. ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషించింది.ఈ సీక్వెల్‌లో సామాజిక అంశాలతో పాటు ‘బయో వార్’ మరియు కుంభమేళా నేపథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడే అఘోరాగా బాలయ్య గర్జన హైలైట్‌గా నిలిచింది.
అఖండ 2 సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుండటంతో, థియేటర్లలో మిస్ అయిన వారు మరియు మళ్ళీ చూడాలనుకునే వారికి ఇది మంచి వీకెండ్ ఆప్షన్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























