భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్

Vaammo Vaayyo Song Out From Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్‌ను సృష్టించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. నేడు వరంగల్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ‘వామ్మో వాయ్యో’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో రవితేజ మాస్ ఎనర్జీ అదిరిపోయింది. అలాగే హీరోయిన్స్ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్‌లో మాస్ అండ్ స్టైలిష్‌గా లుక్స్ తో పర్ఫెక్ట్ ఫెస్టివల్ వైబ్‌ని సెట్ చేసింది ఈ పాట.

ఫస్ట్ బీట్ నుంచే పండుగ జోష్‌ను తెరపైకి తీసుకొచ్చింది. రవితేజ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, స్వాగ్‌తో మెస్మరైజ్ చేశారు. ఆషికా రంగనాథ్, డింపుల్ గ్లామర్‌తో పాటు గ్రేస్‌ఫుల్ డాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. ఈ పాటకు దేవ్ పవార్ లిరిక్స్ అందించగా, స్వాతిరెడ్డి ఆలపించారు. మొత్తానికి మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే హుక్ స్టెప్స్, గ్రాండ్ విజువల్స్‌తో థియేటర్‌లో అదిరిపోయే వామ్మో వాయ్యో పర్ఫెక్ట్ ఫెస్టివల్ సాంగ్ అని చెప్పొచ్చు.

ఇక, ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురెళ్ల, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్. భర్త మహాశయులకు విజ్ఞప్తి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీగా ప్రేక్షకుల్ని అలరించబోతుంది. కాగా జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.