స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ,రవికాంత్ పేరేపు దర్శకత్వంలో చేయాల్సిన బ్యాడాస్ చిత్రాన్ని పక్కన పెట్టి మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి వినూత్న చిత్రంతో మెప్పించిన దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జే తో సిద్దు చేతులు కలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది సితార బ్యానర్‌లో సిద్దుకు మూడవ సినిమా. ఈ ప్రాజెక్ట్ ఒక పక్కా యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ గా ఉండబోతోందని, ఇందులో సిద్దు ఒక సరికొత్త మరియు వైవిధ్యమైన అవతారంలో కనిపిస్తారని సమాచారం.
నిజానికి సిద్దు ఇదే బ్యానర్ లో కోహినూర్ , బ్యాడాస్ చిత్రాలు చేయాల్సింది అయితే ప్రస్తుతం పక్కన పెట్టి, సిద్దు ఈ స్వరూప్ ఆర్‌ఎస్‌జే సినిమాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2026 ప్రథమార్ధంలోనే దీనిని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
సిద్దు ఇటీవల నటించిన తెలుసు కదా అలాగే అంతకుముందు వచ్చిన జాక్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ నేపథ్యంలో, స్వరూప్ ఆర్‌ఎస్‌జే సినిమాతో తిరిగి తన ఫామ్‌లోకి రావాలని సిద్దు పట్టుదలతో ఉన్నారు. టిల్లు ఇమేజ్ నుండి బయటకు వచ్చి, తనలోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించేలా ఈ కథ వుండనుందట. త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























