నటీనటులు : ఆది, అర్చన అయ్యర్, శ్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ తదితరులు
దర్శకుడు : యుగంధర్ ముని
నిర్మాతలు : మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు
సినిమాటోగ్రాఫర్ : ప్రవీణ్ కె బంగారి
సంగీత దర్శకుడు : శ్రీచరణ్ పాకాల
ఎడిటర్ : శ్రవణ్ కటికనేని
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆది సాయికుమార్ కథానాయకుడిగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంబాల’ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. మిస్టరీ, సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది.ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం అలాగే ప్రమోషన్స్ కూడా బాగా చేయడంతో సినిమాపై అంచనాలు పెంచింది, మరి ఈసినిమా ఎలా వుంది? ఆది సాయి కుమార్ ఈసినిమాతోనైనా కం బ్యాక్ ఇచ్చాడో లేదో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
ఈ కథ 1980వ దశకంలో శంబాల అనే గ్రామంలో జరుగుతుంది. ఒక ఉల్క ఆ గ్రామంలో పడటం, దానిని గ్రామస్తులు ‘బండ భూతం’ అని పిలవడం, అప్పటి నుండి అక్కడ ఆవు పాలకు బదులు రక్తం రావడం వంటి భయంకరమైన మార్పులు చోటుచేసుకోవడం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ వింత సంఘటనల వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి ప్రభుత్వం తరపున జియో సైంటిస్ట్ విక్రమ్ (ఆది) అక్కడికి వస్తాడు. సైన్స్‌ను మాత్రమే నమ్మే విక్రమ్, మూఢనమ్మకాలు కలిగిన గ్రామస్తుల మధ్య జరిగే సంఘర్షణ, ఆ మిస్టరీని అతను ఎలా ఛేదించాడు అనేదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ :
దర్శకుడు యుగంధర్ ముని సినిమా ప్రారంభం నుండే ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, ఉత్కంఠను కలిగించే మలుపులు సినిమాకు బలాన్ని ఇచ్చాయి. ప్రథమార్ధంలో కథనం కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతాయి. ఊరి దేవత చరిత్ర, ఉల్క వెనకున్న రహస్యం మరియు అరిషడ్వర్గాల కోణాన్ని దర్శకుడు ద్వితీయార్ధంలో చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగాలతో కూడి ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది.
నటీనటుల పరంగా చూస్తే ఆది సాయికుమార్ తన కెరీర్‌లో ఒక విభిన్నమైన పాత్రను ఎంచుకున్నాడని చెప్పవచ్చు. నాస్తికుడైన శాస్త్రవేత్తగా విక్రమ్ పాత్రలో ఆయన నటన సెటిల్డ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. చాలా కాలం తర్వాత ఆయనకు ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ దొరికింది. ఇక దేవి పాత్రలో అర్చన అయ్యర్ తన నటనతో ఆకట్టుకుంది. రవి వర్మ, మధునందన్, హర్ష వర్ధన్ వంటి ఇతర నటులు తమ పరిధి మేరకు చక్కగా నటించారు. ముఖ్యంగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే హారర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి.
సాంకేతికంగా ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం అతిపెద్ద బలం. సినిమాలోని సస్పెన్స్ మూమెంట్స్‌ను తన సంగీతంతో మరింతగా ఎలివేట్ చేశారు. ప్రవీణ్ కె. బంగార్రి సినిమాటోగ్రఫీ గ్రామ వాతావరణాన్ని, మిస్టరీ అంశాలను అద్భుతంగా చిత్రీకరించింది. దర్శకుడు యుగంధర్ ముని ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. సైన్స్ మరియు పురాణాలను కలిపి ఒక వినూత్నమైన కథను చెప్పే ప్రయత్నం చేశారు. కథలోని కోర్ పాయింట్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు.ఎడిటింగ్ ఓకే నిర్మాణ విలువలు ఉన్నతంగావున్నాయి .
ఓవరాల్ గా ‘శంబాల’ డీసెంట్ థ్రిల్లర్ అనేలా వుంది. కొత్త తరహా కథలను, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. ఆది సాయికుమార్ తన కెరీర్‌లో ఒక ప్రయోగాత్మక సినిమాతో విజయం సాధించారని చెప్పవచ్చు. తన ఖాతాలో చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా పడింది . సస్పెన్స్, థ్రిల్ మరియు ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం వీకెండ్‌లో చూడదగ్గ ఒక మంచి సినిమా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























