బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉంటాం – అఖండ 2 టీం

akhanda 2 team extends support to bangladesh hindus

 నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’. తాజాగా  ఈసినిమా  బృందం ఒక ఉదాత్తమైన నిర్ణయాన్ని తీసుకుంది.బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరుగుతున్న హింసాకాండను ఖండిస్తూ మరియు బాధితులకు సంఘీభావం తెలుపుతూ చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బంగ్లాదేశ్‌లో హింసకు గురవుతున్న హిందూ సమాజానికి మరియు ఇతర అమాయక ప్రజలందరికీ తాము అండగా ఉంటామని ప్రకటించారు.పౌరులపై జరిగే ఎలాంటి హింసనైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని,ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు.-బాధితుల కోసం మరియు వారి కుటుంబాల కోసం తాము ప్రార్థిస్తున్నామని, మానవత్వంతో అందరూ కలిసి శాంతి మరియు రక్షణ కోసం కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా  కోరారు.

బంగ్లాదేశ్‌లో ఇటీవల ఒక హిందూ యువకుడిపై జరిగిన మూకదాడి వంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ‘అఖండ 2’ వంటి భారీ చిత్ర బృందం ఇలాంటి సున్నితమైన అంశంపై స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద  దుమ్మురేపుతుంది.రెండో వారం లోకూడా ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది. తమన్ ఈసినిమాకు సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ నిర్మించింది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.