నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు ఇంటెన్స్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘మైసా’. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన యాక్షన్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్‌లో రష్మిక ఒక గిరిజన తిరుగుబాటు యువతిగా అత్యంత క్రూరమైన మరియు సహజమైన లుక్‌లో కనిపించారు.ఒళ్లంతా రక్తం, తెగిపోయిన చేతి బేడీలు, చేతిలో గన్ మరియు కళ్లలో రగిలే కోపంతో ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రొమాంటిక్ మరియు కమర్షియల్ పాత్రలతో మెప్పించిన రష్మిక, ఈసారి ఒక గిరిజన నాయకురాలిగా పూర్తిగా ‘రెబల్’ మోడ్‌లోకి మారిపోయారు. గ్లింప్స్‌లో జేక్స్ బిజోయ్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌లకు మరింత బలాన్ని చేకూర్చింది.
‘మైసా’ అంటే గిరిజన భాషలో “అమ్మ” అని అర్థం. గోండు గిరిజన తెగల నేపథ్యంతో, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఒక సహజ నాయకురాలి కథగా ఈ సినిమా రూపొందుతోంది. స్వేచ్ఛ, పోరాటం మరియు బలమైన భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ‘పుష్ప 2’ విలన్ తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























