రెమ్యునరేషన్ లేకుండానే సినిమా చేసిన రవితేజ

Ravi Teja Acts in Bhartha Mahasayulaku Wignyapthi Without Charging Remuneration

మాస్ మహారాజా రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన ఈసినిమాలు అనుకున్న విజయాన్ని అందించలేకపోయాయి.దాంతో అయన తన నెక్స్ట్ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. రిలీజ్ కు రెడీ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వస్తుంది.ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది ఇది రవితేజ కు నిజంగా గుడ్ న్యూసే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు రవితేజ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 20 నుండి 25 కోట్ల వరకు పారితోషికం తీసుకునే రవితేజ, ఈ సినిమా విషయంలో మాత్రం తన లాభాల్లో వాటా పద్ధతిని ఎంచుకున్నట్లు సమాచారం ఈ విషయాన్ని స్వయంగా ఈసినిమా నిర్మాతే వెల్లడించారు.అయితే సినిమా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే రిలీజ్ కావాలని రవితేజ ముందే చెప్పేశారట.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫన్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తుంది. ఈ కథపై ఉన్న నమ్మకంతో పాటు, సినిమా నిర్మాణ వ్యయం పెరగకుండా ఉండేందుకు రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నారట. నిర్మాతలకు భారం కాకూడదనే ఉద్దేశంతో, సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో మాత్రమే వాటా తీసుకోవాలని ఆయన ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా రవితేజ నిర్మాతలకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా, కంటెంట్ పట్ల తనకున్న అంకితభావాన్ని మరోసారి చాటిచెప్పారు.

గత కొంత కాలం నుండి రవితేజ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి.దీంతో తన తదుపరి సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే లక్ష్యంతో రవితేజ తన పారితోషికాన్ని పక్కన పెట్టడం విశేషం. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ ,డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

రవితేజ రీసెంట్ ఫామ్ కూడా ఈసినిమాపై పడలేదు. ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా కంప్లీట్ అయిపొయింది.సినిమాపై ఎలాగూ పాజిటివ్ బజ్ వుంది. దానికి తోడు సంక్రాంతికి సీజన్ లో వస్తుండడం అడ్వాంటేజ్ కానుంది. సో రవితేజ కు హిట్ కొట్టడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.