బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ మరియు దర్శకుడు ఆదిత్య ధార్ కాంబినేషన్లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఈ చిత్రం విడుదలై 17 రోజులు పూర్తయినప్పటికీ, వసూళ్లలో ఏమాత్రం తగ్గకుండా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 870.36కోట్ల మార్కును అధిగమించి, అతి త్వరలోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రం కేవలం 16 రోజుల్లోనే దేశ వ్యాప్తంగా రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధించి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తద్వారా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ (18 రోజులు) రికార్డును బద్దలు కొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాలీవుడ్ భారీ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, ‘ధురంధర్’ తన హవాను కొనసాగిస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలవడమే కాకుండా, ‘ఛావా’ మరియు ‘కాంతార: చాప్టర్ 1’ వంటి చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా దాటేసింది.నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 40కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, ఈ సినిమా మరో వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కును అందుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే గనుక జరిగితే, కేవలం సింగిల్ లాంగ్వేజ్‌లో (హిందీ) విడుదలయ్యి రూ. 1000 కోట్లు వసూలు చేసిన మొదటి భారతీయ సినిమాగా ‘ధురంధర్’ నిలుస్తుంది.రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ అద్భుతమైన టేకింగ్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించడం, అది 2026 మార్చిలో విడుదల కానుండటంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























