ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ మరియు కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మరియు అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ‘గిరిగిర’, ‘సల్లంగుండాలే’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచి సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందుకోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు తన మద్దతును తెలియజేశారు.ఇక ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. రోషన్ ఈసారి ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తునట్లు వుంది. ప్రీ-ఇండిపెండెన్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో రోషన్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ సినిమాకు సాంకేతిక నిపుణుల బలం తోడవ్వడం విశేషం. మెలోడీ బ్రహ్మ మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్‌ను అందించారు.లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా రిక్రియేట్ చేశారు.ఆర్. మధీ సినిమాటోగ్రఫీ ఆనాటి ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లేలా ఉంది. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల పనితీరు ‘ఛాంపియన్’ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెడుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























