డెకాయిట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసిన బిగ్ ఫిల్మ్ – అడివి శేష్

Dacoit Is a Big Film Made to International Standards Says Adivi Sesh

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ నెక్స్ట్ డెకాయిట్ తో అలరించబోతున్నాడు. ఈసినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. శేష్ పుట్టినరోజు సందర్భంగా న మేకర్స్ ఈరోజు న టీజర్‌ను విడుదల చేశారు.ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమా పక్కా హిట్ అనే టాక్ వస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ట్విట్టర్లో చాలా కాలంగా చదువుతున్నాను. కుర్రాడు ఎక్కడికి పోయాడు? ఏం చేస్తున్నాడు? అని అంటున్నారు( నవ్వుతూ). ఇక్కడే ఉన్నాను. ఈ సినిమానే చేస్తున్నాను. ఈ సినిమా విషయంలో మేము చాలా ప్రౌడ్ గా ఉన్నాము. ఇది చాలా బిగ్ ఫిలిం. రెండు భాషల్లో తీశాం .ఇది ప్రాపర్ తెలుగు, హిందీ సినిమా. ఒక తెలుగోడు ఒక హిందీ వోడు కలిసి చేసిన సినిమా. నేను షానియల్ కలిసి రాశాము. తను నా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం యూఎస్ లో పెరిగాం. తను మన కల్చర్ అర్థం చేసుకొని నేను తన కల్చర్ అర్థం చేసుకుని ఒక హైబ్రిడ్ సినిమా చేశాం. తను టెక్నికల్ ఒక అమెరికన్ స్టైల్ లో తీశాడు.

అనురాగ్ సార్ లాంటి వరల్డ్ క్లాసు ఫిలిం మేకర్ తో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన మాకు ఎంతో మంచి గైడెన్స్ ఇచ్చారు. నిజంగా అది మా అదృష్టం. మృణాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. తన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మీరు చూస్తారు. ఇదంతా జరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సుప్రియ గారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వచ్చిందంటే కారణం సుప్రియ గారే. నాగ్ సార్ కన్నెపెట్టరో కన్నుకొట్టరో సాంగ్ ఆలోచన కూడా సుప్రియ గారిదే. ఆ క్లాసిక్ సాంగ్ తీసుకొని మన సినిమాలో వైబ్రేట్ గా వాడడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సునీల్, జాన్వి గారు కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా కాలం తర్వాత మీ అందరిని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.