యంగ్ హీరో ఆది సాయి కుమార్ నెక్స్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’ తో రానున్నాడు.ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొట్టింది. శంబాల నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేసింది. సోషల్ మీడియాలో అయితే శంబాల మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ట్రెండ్ అయ్యాయి. డిసెంబర్ 25 రాబోతోన్నఈసినిమా బ్లాక్ బస్టర్ అని ట్రేడ్ సర్కిళ్లలో బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు శంబాలని అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం ఏరియాలో మైత్రి, ఏపీ, సీడెడ్ ఏరియాలో ఉషా పిక్చర్స్ శంబాలని భారీ ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో సైతం ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఓవర్సీస్ బాధ్యతల్ని మూన్ షైన్ సినిమాస్ తీసుకుంది. ఇక కర్ణాటకలో ఈ సినిమాను కుమార్ బెంగళూర్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పటికే శంబాల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలో ఆహా పోటీ పడి గెలిచింది. శాటిలైట్ విషయంలో జీ నెట్వర్క్ ముందుండి హక్కులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్‌లో ఉండటం విశేషం.
నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడా వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో రాజీపడని నాణ్యతతో రూపొందించారు. ఈ మూవీని విజువల్ వండర్‌గా, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా అద్భుతమైన దృశ్య కావ్యంగా తెరకెక్కించారు.
ప్రవీణ్ కె బంగారి అందించిన ఆకర్షణీయమైన విజువల్స్, శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో రాణించగల ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున తీసుకురానున్నారు.యగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























