తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నుండి వస్తున్న చివరి సినిమా జన నాయగన్. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా విడుదలకు సిద్దమవుతుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ దళపతి కచేరి చార్ట్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు రెండో సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు. రేపు ఈ సాంగ్ విడుదలకానుండగా ఈరోజు ప్రోమోను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ ఎలివేషన్ సాంగ్ గా రానున్న ఈసాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యేలా వుంది.రేపు సాయంత్రం 6 :30 గంటలకు ఫుల్ సాంగ్ విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమా ఎలాంటి వాయిదా లేకుండా పొంగల్ కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా రిలీజ్ కానుంది. అయితే అయితే సంక్రాంతికి తెలుగు నుండి పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.దాంతో జన నాయకుడు తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదుర్కోనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























