100 మిలియన్లు దాటిన చికిరి చికిరి సాంగ్

Chikiri Chikiri Telugu Version Song Achieves 100 Million Views Milestone

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నుండి రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది. గత నెల 7న విడుదలైన ఈపాట కేవలం ఒక్క తెలుగు వెర్షన్ లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను దాటగా, ఐదు భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఈ పాట ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటలోని పవర్ ఫుల్ బీట్స్, ఆకట్టుకునే రిథమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, లెక్కలేనన్ని రీల్స్, ఫ్యాన్ ఎడిట్‌లతో అలరిస్తోంది.

షూటింగ్ కు విషయానికి వస్తే త్వరలోనే  ఢిల్లీ నెక్స్ట్ షెడ్యూల్  స్టార్ట్ కానుంది. జనవరి లోగా షూటింగ్  కంప్లీట్ చేసి అనుకున్న తేదీకి రిలీజ్ చేయనున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది  మార్చి 27న పెద్ది థియేటర్లలోకి రానుంది.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.