భారీ ధరకు అమ్ముడైన పరాశక్తి ఓటీటీ రైట్స్ 

Parasakthi OTT Rights Sold for a Massive Price

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పరాశక్తి. ఇది తనకు 25వ చిత్రం. ఇక ఈసినిమా థియేట్రికల్ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్‌ను ఖరారు చేసుకుంది. ఇది శివ కార్తికేయన్ చిత్రాలలోనే అత్యధిక ధరకు అమ్ముడైన సినిమాగా రికార్డు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 ఓటీటీ సంస్థ అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 52 కోట్లని తమిళ మీడియా కథనాలు ప్రచురించింది. శివ కార్తికేయన్ గత చిత్రాలు కూడా మంచి ఓటీటీ డీల్స్ సాధించినప్పటికీ, ‘పరాశక్తి’ డీల్ మాత్రం గత రికార్డులన్నింటినీ అధిగమించింది. ఈ డీల్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది.

ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇందులో అథర్వ, శ్రీలీల, రవి మోహన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.శ్రీలీల కు తమిళ్ లో ఇదే మొదటి సినిమా. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.మ్యూజిక్ డైరెక్టర్ గా తనకు ఇది 100 వ సినిమా. ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.