కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన అన్నగారు వస్తారుసినిమా విడుదల విషయంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోయాట. దాంతో ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ 25 న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉన్నా అనివార్యకారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబర్ 12కు ప్లాన్ చేసినా విడుదల కుదరలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకు ఎదురైన ఇబ్బందులన్నింటినీ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న తప్పనిసరిగా విడుదల చేయబోతున్నారని కోలీవుడ్ మీడియా టాక్. నలన్ కుమారస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేయగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
ఇందులో కార్తీ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా తెలుగులో నటించిన కృతి శెట్టి ఈ సినిమాతోనే తమిళంలోకి అడుగుపెడుతున్నారు.ఈ సినిమా తెలుగులో అన్నగారు వస్తారు టైటిల్‌తో, తమిళంలో వా వాతియార్ పేరుతో విడుదల కానుంది. కార్తీకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందున ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























