బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మౌత్ టాక్ కారణంగా రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.వారాంతాల్లోనే కాకుండా వర్కింగ్ డేస్ లోకూడా ఊహించని వసూళ్లను రాబట్టుకుంటూ హవా కొనసాగిస్తోంది. నిన్న ఈసినిమా దేశవ్యాప్తంగా నికర వసూళ్లు రూ 31.80 కోట్లు సాధించింది.మొదటి రోజు కంటే 11 వరోజు ఎక్కువ రాబట్టడం విశేషం.అంతేకాదు సెకండ్ మండే హైయెస్ట్ గ్రాసర్ గా ఆల్ టైం రికార్డు సృష్టించింది. దాంతో 11 రోజుల్లో సినిమా 396 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈరోజుతో 400కోట్ల క్లబ్ లో చేరనుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 550 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఫుల్ రన్ లో ఈజీగా 700 కోట్ల క్లబ్ లో చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది.ఈ సినిమా కంటే ముందు ‘కాంతార:చాప్టర్, ఛావా, సైయారా’ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు.కందహార్ విమానం హైజాక్, 2000లో జరిగిన పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడులు వంటి సంఘటనల నేపథ్యంలో సాగే గూఢచార కార్యకలాపాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఇక ఈసినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దురంధుర్ తెలుగులోనూ విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























