అఖండ 2 టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Akhanda 2 Telangana Govt Issues GO for Ticket Price Hike

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ 2: తాండవం’ చిత్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు (డిసెంబర్ 12, 2025) విడుదల కానున్న ఈ సినిమాకు టికెట్ ధరల పెంపుదల (Ticket Hike)కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు హోం (సినిమాలు) శాఖ మెమో నెం. 6593-పి/జనరల్.ఏ1/2025 ద్వారా డిసెంబర్ 10, 2025న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టికెట్ ధరల పెంపు వివరాలు

1. టికెట్ ధరల పెంపు (3 రోజుల పాటు):

  • పెంపుదల వ్యవధి: డిసెంబర్ 12, 2025 నుండి డిసెంబర్ 14, 2025 వరకు (3 రోజులు).
  • సింగిల్ స్క్రీన్లలో: ప్రతి టికెట్‌పై ₹50 చొప్పున పెంపునకు అనుమతి లభించింది (జీఎస్టీతో కలిపి).
  • మల్టీప్లెక్స్‌లలో: ప్రతి టికెట్‌పై ₹100 చొప్పున పెంపునకు అనుమతి లభించింది (జీఎస్టీతో కలిపి).

2. వన్ షో స్పెషల్ ప్రదర్శన:

  • ప్రత్యేక షో: విడుదల రోజున (డిసెంబర్ 12, 2025) రాత్రి 8:00 గంటలకు ఒక ప్రత్యేక ప్రదర్శన (One Show) వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.
  • ధర: ఈ ప్రత్యేక షో టికెట్ ధర ₹600 గా నిర్ణయించారు (జీఎస్టీతో కలిపి).
ఇండస్ట్రీ సంక్షేమానికి 20% వాటా

టికెట్ ధరల పెంపుదల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం (ఇరవై శాతం) తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ నిధికి (Telugu Film Industry Employees Federation Welfare Association Account) విధిగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

  • ఈ నిధులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ఆధ్వర్యంలో కార్మిక కమిషనర్‌తో సంప్రదించి నిర్వహించబడతాయి.

ఇక నార్కోటిక్స్, డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ యొక్క దుష్ప్రభావాలపై ప్రకటనలను (Screen Advertisements on adverse effects) ప్రదర్శించాలని కూడా జీవోలో ఆదేశించారు. థియేటర్ల యజమాన్యాలు ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి. ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.