ఓవర్సీస్ లో అదరగొడుతున్న అఖండ 2

Akhanda 2 Sees Strong Overseas Advance Box Office Sales

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో దూకుడు చూపిస్తోంది.బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న భారీ క్రేజ్ కారణంగా అఖండ 2 ఓవర్సీస్‌లో అంచనాలను మించి దూసుకెళ్తోంది.ముందుగా డిసెంబర్ 5 విడుదలచేయాలని చుసిన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తరువాత విడుదల తేదీని డిసెంబర్ 12, 2025 గా ప్రకటించడంతో మళ్లీ బుకింగ్స్ జోరందుకున్నాయి.వారం ఆలస్యంగా విడుదలకావడం సినిమా ఇంకా కలిసొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా యూఎస్ఏ (USA) ప్రీమియర్ల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి.ప్రీ-సేల్స్ మొదలైన కొద్ది గంటల్లోనే దాదాపు 7,200 టికెట్లు అమ్ముడయ్యాయి.ప్రీమియర్ కలెక్షన్లు తక్కువ సమయంలోనే $125,000 మార్కును దాటాయి. దాంతో సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

మొదటి భాగం ‘అఖండ’ ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. సీక్వెల్ అయిన దీనిపై ఇంకా పెద్ద అంచనాలు ఉండడంతో, డిస్ట్రిబ్యూటర్లు ఇది $2 మిలియన్ల మార్కును కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా గురువారం రాత్రి నుండే ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటికే ఆంధ్రా లో అందుకు సంబంధించిన అనుమతులు కూడా రావడంతో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.నైజాంలో ఈరోజు ప్రీమియర్స్ & టికెట్ హైక్ జీవో రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.