టాలీవుడ్ యువ నటుడు నందు, యామిని భాస్కర్ జంటగా నటించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయాలని మొదట ప్రకటించారు. అయితే అదే రోజున బాలకృష్ణ చిత్రం ‘అఖండ 2’ కూడా విడుదలవుతుండడం తో సైక్ సిద్దార్థ వెనక్కి వెళ్ళిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలయ్యకు తమ మద్దతు ఉంటుందని తెలుపుతూ, ‘సైక్ సిద్ధార్థ’ సినిమాను జనవరి 1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక వీడియో ద్వారా ప్రకటించింది. సైక్ సిద్ధార్థ ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు.అయితే అఖండ 2 తో విడుదలచేస్తే నష్టం తప్పదని భావించి సినిమా విడుదల వాయిదా వేసుకున్నారు.తెలుగు రాష్ట్రాల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఈసినిమాను రిలీజ్ చేయనుంది.
ఈ చిత్రానికి ‘మీలాంటి యువకుడి కథ’ అనేది ఉపశీర్షిక. అడల్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు నందు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























