తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాలూ రెండో రోజు మెగాస్టార్ చిరంజీవి గారు పాల్గొన్నారు. ఇక ఈ ‘ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంత గొప్ప సభకు, విభిన్న రంగాలకు చెందిన నిష్ణాతులు ఉన్న ఈ వేదికకు తనను ఆహ్వానించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నానని, ఇది తన ఒక్కడికి వచ్చిన ఆహ్వానం కాదని, సినీ పరిశ్రమ తరపున వచ్చిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కలిసిన సందర్భాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా మారుస్తానని చెప్పారని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇతర భాషల వాళ్లు కూడా హైదరాబాద్‌కు వచ్చి షూటింగ్‌లు చేసుకోవాలని సీఎం కోరుకుంటున్నారని చిరంజీవి పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ పూర్తి సహకారం అందిస్తున్నారని, త్వరలోనే ఇండస్ట్రీ అభివృద్ధికి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని, హైదరాబాద్‌ను ప్రపంచ సినిహబ్‌గా మార్చే ప్రయత్నం చేస్తామని చిరంజీవి అన్నారు. ఈ సభకు తనను ఆహ్వానించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వచ్చినప్పుడు తాను అన్నపూర్ణ స్టూడియోలో ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నానని, వెంటనే షూటింగ్ ఆపేసి వారితో మాట్లాడానని చిరంజీవి సరదాగా చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి.
ఇక ఈ సమ్మిట్ లో పాల్గొనడంపై చిరంజీవి ట్వీట్ కూడా చేశారు. నిన్న ఫ్యూచర్ సిటీలో జరిగిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ C.M శ్రీ.రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ లో భాగంగా.. అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి సైతం ప్రాముఖ్యతను ఇస్తూ.. హైదరాబాద్ ను ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది. ఈ మహత్తర కార్యాచరణలో నా దిశా నిర్దేశం కోరడం.. నాకు ఎంతో ఆనందదాయకం. C.M రేవంత్ రెడ్డి గారి విజన్ అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో మన నుండి మరెన్నో “World Class Projects” రూపుదిద్దాలని, ప్రపంచ సినిమా హైదరాబాద్ పై దృష్టి సారిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























