తమిళ హీరో కార్తీ వా వాతియార్ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.తెలుగులో ఈసినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. అందులో భాగంగా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా తక్కువ రన్ టైంను ఫిక్స్ చేశారు మేకర్స్. కేవలం 2 గంటల 8నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది. ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో కార్తీ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు.ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించి సినిమా పై అంచనాలు పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నలన్ కుమారస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేయగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్ నిర్మించింది.అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది. తమిళ్ లో పెద్దగా పోటీ లేకుండా వస్తుండగా తెలుగులో మాత్రం అఖండ 2 విడుదలకానుండడంతో అన్నగారు వస్తారు పోటీ ఎదుర్కోనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























