మాస్ మహారాజ రవితేజ నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి తో వస్తున్నాడు. కిషోర్ తిరుమల ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అనిపించుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన కోటికిపైగా వ్యూస్ తో మ్యూజిక్ యాప్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. బెల్లా బెల్లా అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి సెకండ్ సాంగ్ కూడా విడుదలకానుంది.అద్దం ముందు అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 10న రిలీజ్ కానుండగా ఈరోజు ప్రోమో ను రిలీజ్ చేశారు. ఈప్రోమో సాంగ్ పై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక రవితేజ ఈసారి తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఫ్రెష్ కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా వస్తున్నాడు.ఇందులో ఆషికా రంగనాథ్ ,డింపుల్ హయతి హీరోయిన్లు గా నటించగా ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈసినిమా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























