సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి సినిమా గురించి మాట్లాడారు.ఇటీవల విడుదలైన వారణాసి గ్లింప్స్ చూసి తాను మహేశ్‌బాబుకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడినట్లు అనిల్ రావిపూడి చెప్పారు.గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మహేశ్ ఎద్దుపై వచ్చిన ఎంట్రీ ప్లాన్ చూసి తనకు మాటలు రాలేదని,అది చాలా భారీగా, క్రియేటివ్‌గా ఉంటుందని తాను ఊహించలేదని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు రాజమౌళికి మాత్రమే సాధ్యంఅని ఆయన అన్నారు. ఆ గ్లింప్స్‌లోని ప్రతి షాట్ తనను షాక్‌కు గురి చేసిందని, ప్రతి ఫ్రేమ్ టైమ్ ట్రావెలర్లా అనిపించిందని ప్రశంసించారు. రాజమౌళి ఎంత ప్రతిభావంతుడో అందరికీ తెలుసని, ఆయన నుంచి మరో అద్భుతం రానుందని గ్లింప్స్ చూశాక అర్థమైందని పేర్కొన్నారు.
ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.వెంకటేశ్ దాదాపు 20 నిమిషాలకు పైగా స్క్రీన్‌పై సందడి చేస్తారని, చిరంజీవి, వెంకటేశ్ మధ్య వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని దర్శకుడు తెలిపారు.అలాగే సంక్రాంతికి ఈసినిమా థియేటర్లలోకి వస్తుందని త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నామని వెల్లడించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























