అఖండ 2 హైప్ డబుల్ .. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్యాన్స్

Akhanda 2 Craze Peaks as Fans Shake Up Social Media

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమా హైప్ రోజురోజుకు రెట్టింపు అవుతోంది. విడుదల తేదీ వాయిదా పడినప్పటికీ, అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తమ అభిమానాన్నిసినిమాపై ఉన్న అంచనాలను బలంగా చాటుతున్నారు.ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది.ఈ అనూహ్య పరిణామం అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. అయినప్పటికీ, ఈ పరిణామం హైప్‌ను మరింత పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా విడుదల వాయిదా పడటంతో, అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేయడానికి మరియు కొత్త విడుదల తేదీని త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేయడానికి సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకుంటున్నారు.WeWantAkhanda2OnDec12th,#WeWantAkhanda2Release,#NewReleaseDatePlease వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.ఈనెల 12న విడుదలచేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే సంక్రాంతికి వరకు మేజర్ రిలీజ్ లేకపోవడం అలాగే క్రిస్మస్ ,న్యూ ఇయర్ హాలిడేస్ ఉండడం తో లాంగ్ రన్ ఉంటుందని అభిమానుల వాదన. ఎలాగూ భారీ క్రేజ్ ఉండడంతో కలెక్షన్ల పరంగా దుమ్ము రేపడం ఖాయం.బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ కూడా 3లక్షలు దాటాయి.

మొదటి భాగం ‘అఖండ’ సాధించిన విజయం,ఈ సీక్వెల్ పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఫ్యాన్స్ మొదటి భాగంలోని డైలాగులు, సన్నివేశాలను గుర్తుచేసుకుంటూ,రెండో భాగం కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతానికి, సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కోర్టు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని, కొత్త విడుదల తేదీని అతి త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.