మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన రీసెంట్ మూవీ కాంత ఓటీటీ లోకి రావడానికి రెడీ అవుతుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత, ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అధికారికంగా ప్రకటన విడుదలైంది. ఈ సినిమా డిసెంబర్ 12, 2025 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, సముద్రఖని మరియు రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో కనిపించారు.
కాంత కథ విషయానికి వస్తే, అయ్య (సముద్రఖని) అనే దర్శకుడు తన తల్లి జీవితం ఆధారంగా ‘శాంత’ అనే సినిమాను తీయాలనుకుంటాడు. ఆయన శిష్యుడు టి.కె.మహదేవన్ (దుల్కర్ సల్మాన్) ఇందులో హీరో. అయితే, షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన ఈ చిత్రం కొన్నేళ్ల తర్వాత ‘కాంత’ పేరుతో మళ్లీ మొదలవుతుంది.
సెట్‌లో హీరో, దర్శకుడికి ఒకరంటే ఒకరికి పడదు. ఈ క్రమంలో సినిమా పూర్తయ్యే దశలో, సినిమా బృందంలో కీలకమైన ఒకరు హత్యకు గురవుతారు. ఆ నేరాన్ని హీరో, దర్శకుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారు.హత్య చేసింది ఎవరు? దాని వెనుక ఉన్న నిజం ఏమిటి? గురుశిష్యుల మధ్య సంబంధాలు ఎందుకు చెడ్డాయి? అనే అంశాల చుట్టూ ఇన్స్‌పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) చేసే దర్యాప్తు ఆసక్తికరంగా ఉంటుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























