తమిళ హీరో కార్తీ వా వాతియార్ రిలీజ్ కు రెడీ అవుతుంది.డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండడం తో వాయిదా వేశారు. ఇక ఈనెల 12న ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం తమిళ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ చేయగా కొద్దీ సేపటి క్రితం తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా అనిపించింది.ఈసినిమా రెట్రో కాన్సెప్ట్ తో అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా వస్తుందనిపిస్తుంది.ఇందులో కార్తీ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు.ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించి సినిమా పై అంచనాలు పెంచేసింది.ఈసినిమా తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో వస్తుంది.నలన్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది.
ఇక ప్రస్తుతం కార్తీ మార్షల్ అనే సినిమా చేస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుండగా తమిళ్ డైరెక్ట్ చేస్తున్నాడు.కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























