నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ‘కలర్ ఫోటో’, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రం దండోరా. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ముఖ్యంగా సమాజంలోని దురాగతాలను, ముఖ్యంగా అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు లేదా వారికి ఎదురుతిరిగినప్పుడు జరిగే దౌర్జన్యకాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిన్న సినిమాకు టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సపోర్ట్ దొరికింది. నైజాంలో సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదలచేస్తుంది.దాంతో దండోరా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈనెల 25న థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే, వ్యంగ్యం, చక్కటి హాస్యం మరియు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా రూపొందుతోంది. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























