నారీ నారీ నడుమ మురారి తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఎక్సయిటింగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నారీ నారీ నడుమ మురారి2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. శర్వా ఈ పండుగ సమయంలో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు, శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాలు సంక్రాంతి విడుదలై పెద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి కి కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫీని జ్ఞాన శేఖర్ విఎస్, యువరాజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కథను భాను బోగవరపు రాశారు, నందు సావిరిగణ సంభాషణలు అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత.త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
ఇక శర్వానంద్ బైకర్ ఈరోజు రిలీజ్ కావాల్సివుండగా వాయిదా పడింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండడంతో విడుదల ఆలస్యం కానుంది. సమ్మర్ లో ఈసినిమాను థియేటర్లోకి తీసుకురానున్నారు.బైక్ రేసింగ్ నేపథ్యంలో జరిగే కథతో అభిషేక్ కంకర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























