యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో 20వ చిత్రంగా, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చారిత్రక చిత్రం స్వయంభూ. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడుపోతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ 7కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్ లో ఇదే రికార్డు ఓవర్సీస్ డీల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిఖిల్ గత చిత్రం ‘కార్తికేయ 2’ ఓవర్సీస్‌లో అద్భుతమైన విజయం సాధించి, $2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ విజయం, ‘స్వయంభూ’ ఒక వీరయోధుడి కథాంశం కావడం, మరియు మేకింగ్ విలువలు భారీగా ఉండటం వలన ఓవర్సీస్‌లో డిమాండ్ పెరిగింది.ఈ రికార్డు డీల్, ఓవర్సీస్ మార్కెట్‌లో నిఖిల్ స్థాయిని మరింత పెంచిందని చెప్పవచ్చు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నారు.ఠాగూర్ మధు సమర్పణలో భవన్ , శ్రీకర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























