అనగనగా ఒక రాజు నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ 

Anaganaga Oka Raju First Single is Out Now

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తరువాత యంగ్ హీరో  నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమా  అనగనగా ఒక రాజు. నిజానికి ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన  ఈసినిమా నవీన్ కు గాయం కావడంతో ఆలస్యమవుతా వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. నిన్న ఈసినిమా  ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 భీమవరం బాల్మ  అంటూ సాగే  ఈ మాస్ సాంగ్  ఆకట్టుకుంది.మిక్కీ జె మేయర్ మాస్  బీట్స్ తో డాన్స్ నెంబర్ గా  వచ్చిన ఈ సాంగ్ లో  నవీన్ ,హీరోయిన్ మీనాక్షి స్టెప్స్  అదరగొట్టారు.ఈ సాంగ్ ను  భీమవరం లోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో లాంచ్ చేశారు.చంద్రబోస్  ఈ సాంగ్ ను రచించగా నూతన మోహన్ తోకలిసి నవీన్ పోలిశెట్టి ఈసాంగ్ ను పాడడం విశేషం. 

సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.మారి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా  నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.