నటీనటులు : రామ్ పోతినేని , భాగ్య శ్రీ బోర్సే ,రాహుల్ రామకృష్ణ , మురళీ శర్మ , రావు రమేష్
సినిమాటోగ్రఫీ : సిద్దార్థ నూని
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
సంగీతం : వివేక్ – మెర్విన్
దర్శకత్వం : మహేష్ బాబు పి
నిర్మాతలు : రవిశంకర్ , నవీన్ యెర్నేని
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం , ట్రైలర్ సరికొత్తగా అనిపించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.వీటికి తోడు హీరోయిన్ గా భాగ్య శ్రీ వుండడం అలాగే మైత్రి బ్యానర్ లో రూపొందిన సినిమా కావడంతో విడుదలకు ముందు ఆంధ్ర కింగ్ తాలూకా సరైన బజ్ వచ్చింది. ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుంది ? రామ్ కి కావాల్సిన హిట్ ఇచ్చిందా లేదో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
గోదావరి జిల్లాలోని గూడవల్లి లంక అనే మారుమూల గ్రామానికి చెందిన సాగర్ (రామ్ పోతినేని), ‘ఆంధ్ర కింగ్’ సూర్య (ఉపేంద్ర)కు వీరాభిమాని. కాలేజ్ లో ఉండగా తన క్లాస్ మేట్ అయిన మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే)తో సాగర్ ప్రేమలో పడతాడు. అయితే, ఆమె తండ్రి సాగర్‌ను తక్కువ చేసి మాట్లాడటంతో, తాను కొద్ది కాలంలోనే తన ఊరిలో సినిమా థియేటర్‌ను నిర్మించి, మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి తగినవాడినని నిరూపించుకోవాలని సవాలు చేస్తాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో, సాగర్ తాను కట్టిన థియేటర్‌ను అమ్మేసి, ఆ డబ్బును తన అభిమాన హీరో సూర్యకు పంపాలని నిర్ణయించుకుంటాడు. అసలు సాగర్ ఎందుకు డబ్బు పంపాలి? కరెంటు సౌకర్యం కూడా లేని తన మారుమూల గ్రామంలో థియేటర్ ఎందుకు కట్టాలి? సాగర్ నేపథ్యం ఏమిటి? సూర్య 100వ సినిమాకు సాగర్ ప్రేమకథకు సంబంధం ఏంటి? చివరకు సాగర్, మహాలక్ష్మి ఒక్కటయ్యారా? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
దర్శకుడు మహేష్ బాబు పచ్చిగొల్ల, ఒక స్టార్ హీరోకు వీరాభిమాని అయిన సాగర్ కథను చాలా నిజాయితీగా, భావోద్వేగంగా చెప్పారు. ఇది కేవలం సినిమా, ఫ్యాన్ వార్స్ గురించి కాకుండా, ప్రేమ కథను, అభిమానం ద్వారా స్ఫూర్తి పొందే పాయింట్‌ను బాగా మిళితం చేశారు. అనవసరమైన ఎలివేషన్లు లేకుండా కథకు కట్టుబడి ఉండటం మంచి విషయం. ప్రతి పాత్రకు ఒక ఉద్దేశం ఉంది.ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 30 నిమిషాలు కొంచెం స్లో అనిపించినా ఆ తరువాత వేగం పుంజుకొని డీసెంట్ అనేలా ముగుస్తుంది.ఇక సెకండ్ హాఫ్ సినిమాకు బలంగా నిలిచింది. ఇంటర్వెల్ తర్వాత కథనం వేగం పుంజుకుని, భావోద్వేగంగా సాగడం సినిమాకు పెద్ద బలం.చివరి 40 నిమిషాలు అయితే ఎమోషనల్ సన్నివేశాలతో సూపర్ అనిపిస్తుంది. సినిమాలో కొన్ని సంభాషణలు బాగున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే రామ్ ఈసినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. సాగర్ పాత్రలో చాలా మెచ్యూర్డ్‌గా,అమాయకమైన ఫ్యాన్ బాయ్‌గా చాలా బాగా ఒదిగిపోయారు.తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మహాలక్ష్మి పాత్రలో భాగ్య శ్రీ మెప్పించింది. తన గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రామ్ – భాగ్య శ్రీ కెమిస్ట్రీ తెర మీద చాలా బాగా అనిపించింది. ఇక రావు రమేష్ ,మురళీ శర్మ తమ అనుభవాన్ని చూపించారు.రావు రమేష్ పాత్రపై వచ్చే దేవాలయం సన్నివేశం అద్భుతంగా పండింది.ఉపేంద్ర పాత్రకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ, క్లైమాక్స్ నటనతో తన మార్కును చూపించారు.హీరోగా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ అదరగొట్టాడు.
టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపించింది.ముఖ్యంగా సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. వివేక్-మెర్విన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. రెండు మెలోడీ పాటలు హాయిని ఇచ్చాయి.అయితే ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుందనిపించింది. సినిమా అక్కడక్కడా స్లో అయినా ఫీల్ తెప్పించింది. విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి. మైత్రి నిర్మాణం ఉన్నతంగా వుంది.
ముగింపు :
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా ఎంగేజింగ్ కథనం, మంచి నటన, సంగీతం కారణంగా హృదయాన్ని హత్తుకునే ఒక మంచి కథా చిత్రంగా నిలిచింది. ఫ్యామిలీ తో కలిసి చూసే విధంగా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెప్పొచ్చు.ఇక ఎట్టకేలకు రామ్ పోతినేనికి హిట్ దొరికినట్లే.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























