యంగ్ హీరో రోషన్ ,మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ఛాంపియన్. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వాతంత్య్రం రావడానికి ముందు హైదరాబాద్‌లో నివసించే ఫుట్‌బాలర్ అయిన మైఖేల్ సీ. విలియమ్స్ మైదానంలో ప్రత్యర్థులను సవాలు చేస్తూ తన ప్రతిభను ప్రదర్శించడంతో ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం దక్కుతుంది. అయితే అతని ముందు చాలా సవాళ్లు ఉంటాయి. మరి వాటిని ఎలా అధిగమించి ఛాంపియన్ ఎలా అయ్యాడు అనే కథాశం తో వస్తుంది ఈసినిమా .
రీసెంట్ గా రిలీజైన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అనేలా ఉంది.రామ్ మిర్యాల వాయిస్ , మిక్కీ జె మేయర్ ట్యూన్స్ సాంగ్ ను లూప్ లో వినేలా చేశాయి.ప్రీ-ఇండిపెండెన్స్ కాలం నాటి కథతో వస్తున్న ఈసినిమా డిసెంబర్ 25న క్రిస్మస్కు విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























