నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారైంది.ఈ మెగా ఈవెంట్ నవంబర్ 28, శుక్రవారం నాడు జరుగనుంది వేదికగా హైదరాబాద్‌లోని కూకట్పల్లి, కైత్లాపూర్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు.ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవెంట్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయంలో మేకర్స్ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు.
అఖండ 2 డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. పార్ట్ 1 సాధించిన విజయం, తాజాగా విడుదలైన ట్రైలర్‌కు వచ్చిన స్పందన కారణంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.14 రీల్స్ ప్లస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇందులో బాలకృష్ణకు జోడీగా సంయుక్త నటించింది.ఇక అఖండ నుండి అపజయమే లేకుండా కొనసాగుతున్నారు బాలకృష్ణ.మరి అఖండ 2 తో తన విజయాల పరంపరను కొనసాగిస్తారో చూడాలి.ఈసినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కూడా వేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























