వరుస విజయాలతో కొనసాగుతున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. నిజానికి ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈసినిమా నవీన్ కు గాయం కావడంతో ఆలస్యమవుతా వచ్చింది.ఇక ఎట్టకేలకు షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జైపుర్ లో చిత్రీకరణ జరుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.ఈసినిమా కోసం నవీన్ తొలిసారిగా సింగర్ గా మారాడు. భీమవరం బల్మా అంటూ సాగే ఈ సాంగ్ ను నవీన్ పాడడం విశేషం ఈనెల 27న ఈ సాంగ్ ను భీమవరం లోని ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో లాంచ్ చేయనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక నవీన్ పొలిశెట్టి తన మార్క్ ప్రమోషన్ స్టైల్‌తో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘ప్రీ-వెడ్డింగ్ వీడియో’ ఆయన కామెడీ టైమింగ్‌కు నిదర్శనంగా నిలిచింది.ఇక ఇప్పుడు సాంగ్ రానుంది.ఈ పాట కూడా సినిమాకు హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























