పూరి సేతుపతి షూట్ కంప్లీట్

PuriSethupathi Shoot Wrapped Up

ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పూరిసేతుపతి (వర్కింగ్ టైటిల్) షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమైన ఈ చిత్రం ఈరోజు తో షూట్ కంప్లీట్ చేసుకుంది. చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్ కి సంబంధించిన వీడియోను టీం విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీడియోలో, పూరి, మొత్తం యూనిట్‌తో కలిసి పనిచేయడాన్ని తాను ఎంతగా మిస్ అవుతున్నానో విజయ్ సేతుపతి తెలియజేస్తూ, ఈ ప్రయాణాన్ని మెమరబుల్, ఆనందకరమైన అనుభవంగా చెప్పుకొచ్చారు.అలాగే పూరి, చార్మీ తమ భావాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన బాండింగ్ ని తెలియజేశారు. విజయ్, పూరి జాకెట్‌ చాలా బావుందని అభినందించడం ఫేర్ వెల్ కు ఫన్ టచ్ ని జోడించింది.

పూరి ఈసినిమాను చాలా తొందరగా పూర్తి చేశాడు. మాములుగానే తన వర్కింగ్ స్టైల్ ఫాస్ట్ గా ఉంటుంది. అయితే లైగర్ నుండి తన శైలికి భిన్నంగా సినిమాలను కంప్లీట్ చేసుకు రాగ పూరి మళ్ళీ ఇప్పుడు ఈ పూరి సేతుపతి తో పాత రూట్ లోకి వచ్చాడు. ఇక షూట్ కూడా కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. త్వరలోనే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలలో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మాజీ , విటివి గణేష్ హిలేరియస్ పాత్రల్లో కనిపించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.