గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’ బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ‘అఖండ 2: తాండవం’ ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఊపును కొనసాగిస్తూ, మేకర్స్ ఇప్పుడు రెండవ సింగిల్‌ను రిలీజ్ చేశారు. వైజాగ్‌లోని జగదాంబ థియేటర్లో ఈవెంట్ ను నిర్వహించారు.జాజికాయ జాజికాయ అంటూ వచ్చిన ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఆపాటను బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త మీనన్లపై చిత్రీకరించారు.
ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్లో కనిపించనుండగా ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను ప్రత్యేకంగా 3డీ ఫార్మాట్లో కూడా విడుదల చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























