ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్ 

Harish Shankar Shares an Update on Ustaad Bhagat Singh

బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తరువాత  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా  ఉస్తాద్ భగత్ సింగ్.ఇప్పటికే  పవన్  ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం షూటింగ్  తుది దశకు చేరుకుంది.డిసెంబర్ లోపు కంప్లీట్ చేయనున్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు పెద్దగా అప్ డేట్స్ ఏమి బయటికి రాలేదు. అయితే తాజాగా హరీష్ శంకర్ ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. డిసెంబర్ లో ఈసినిమా నుండి  ఫస్ట్ సింగిల్ రానుందని  హరీష్  ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్  సంగీతం అందిస్తుండడంతో ఆడియో పై కూడా భారీ అంచనాలు వున్నాయి.త్వరలోనే  ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. హరీష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈసినిమాలో  శ్రీలీల ,రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తుండగా రాక్  స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 

ఇక ఇదిలావుంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ తో  వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసినిమా 300 కోట్లకుపై గా వసూళ్లను రాబట్టుకొని పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించింది. పవన్ కు ఈఏడాది ఇది సెకండ్ రిలీజ్.జులై లో  హరి హర వీరమల్లు  పార్ట్ 1 తో రాగ ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఆ తరువాత  ఓజీ తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.