స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న విడుదలై బస్టర్ దిశగా దూసుకుపోతుంది. రెండో వారంలో కూడా ఈసినిమా సాలిడ్ హోల్డ్ కొనసాగిస్తూ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేయడంతో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొస్తుంది.10 రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా 28.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఫుల్ రన్ లో 35కోట్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ లేకపోలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు నిన్నటి తో యూఎస్ఏ లో 700K డాలర్ల వసూళ్లను క్రాస్ చేసింది. ఫుల్ రన్ లో 1 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.ఈసినిమాలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి , అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటించగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. గీతా ఆర్ట్స్ నిర్మించింది.
ది గర్ల్‌ఫ్రెండ్ కథ : భూమా (రష్మిక మందన్న) అనే అమ్మాయి, తన పీజీ కోసం హైదరాబాద్‌లోని ఒక కాలేజీలో చేరుతుంది. అక్కడే పీజీ చేస్తున్న విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఆమెను ఇష్టపడతాడు. విక్రమ్‌కి జెలసీ, పొసెసివ్‌నెస్ ఎక్కువగా ఉండటం వల్ల వారి రిలేషన్షిప్లో వచ్చిన సమస్యలు, బ్రేకప్ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























