మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడిక్ డ్రామా కాంత నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10.05 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బుక్ మైషో లో ఈసినిమాకు మొదటి రోజు లక్షా 20వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. తెలుగు , తమిళంలో విడుదలైన ఈసినిమాకు రెండు భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కాంత కు వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా, వీకెండ్‌లో అంటే శని, ఆదివారాల్లో వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న పీరియాడిక్ డ్రామా మరియు క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యం, నటీనటుల అద్భుతమైన ప్రదర్శన, మరియు పాజిటివ్ రివ్యూల బలం మీద రాబోయే రోజుల్లో కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉంది.
తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా రానా దగ్గుబాటి , సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించారు.దుల్కర్ తో కలిసి రానా ఈసినిమాను నిర్మించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























