ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల SSMB 29 ఈవెంట్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మరి కొన్ని గంటల్లో రామోజీఫిలిం సిటీలో ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరుగనుంది.ఇక ఈ ఈవెంట్లో అసలు ఏమి రివీల్ చేస్తారు అనే దానిపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, దర్శకుడు రాజమౌళి తాజాగా ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ను ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజమౌళి తన అధికారిక ప్రకటనలో, నేడు తాము చేయనున్న మ్యాజిక్ ఏంటంటే.. ‘గ్లోబ్ ట్రాటర్’ టైటిల్‌ను గ్రాండ్ విజువల్ వరల్డ్‌తో రివీల్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.ఈ విజువల్ ట్రీట్‌ను ముందుగా ఈవెంట్లో పెద్ద తెరపై ప్రదర్శించిన తర్వాతే, ఆన్లైన్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
దీంతో, అభిమానులకి మరియు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు నేడు ఏం రాబోతుందో క్లారిటీ వచ్చేసింది. ఈ భారీ ట్రీట్‌ను రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ ఎలా తీర్చిదిద్దుతారో చూడాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను రాజమౌళి ఏ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారో ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ ద్వారా అర్థమవుతోంది. ఇప్పటివరకు ఈసినిమా నుండి పృథ్వీరాజ్,ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ల తోపాటు గ్లోబ్ ట్రాటర్ థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు.వీటన్నింటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























